బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ విడుదల రేపటికి వాయిదా..
స్వేద పత్రం విడుదలను ఆదివారానికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గత పదేళ్ల బీఆర్ఎష్ ప్రభుత్వానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ స్వేద పత్రాన్ని శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇది వాయిదా పడింది. స్వేద పత్రం విడుదలను ఆదివారానికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.