Asianet News TeluguAsianet News Telugu

ప్రతి రోజూ కరోనా బులెటిన్ ఇవ్వాల్సిందే: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో ప్రతి రోజూ కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

release daily covid -19 bulletins Telangana High court tells state government lns
Author
Hyderabad, First Published Feb 25, 2021, 11:50 AM IST

హైదరాబాద్:  

హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రతి రోజూ కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రెండు రోజుల నుండి కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వకుండా నిలిపివేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ప్రతి వారం కరోనా హెల్త్ బులెటిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.కరోనా బులెటిన్ నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారంనాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ప్రతి రోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.


సెకండ్ వేవ్ ప్రారంభమైంది ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు కోరింది. 50 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్ తీసుకొనేలా ప్రచారం చేయాలని హైకోర్టు సూచించింది.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనేలా అవకాశం కల్పించాలని హైకోర్టు తెలిపింది.మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. జనం గుంపులుగా ఉండకూడదని కోరింది. వృద్దులు వ్యాక్సిన్ వేసుకొనేలా ప్రచారం చేయాలని కోరింది.

 

గత ఏడాదిలో కరోనా కేసుల విషయంలో సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజూ కరోనా హెల్త్ బులెటిన్లను విడుదల చేస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.

కరోనా కేసులు, హెల్త్ బులెటిన్ల విషయంలో హైకోర్టు గతంలో పలు సూచనలు చేసింది. హైకోర్టు సూచనలను పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ తీరుపై హైకోర్టు తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేసింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హైకోర్టు ముందు హాజరైన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios