మంగళవారం నుంచి హైదరాబాద్ లో రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా సదస్సు మొదలు కానుంది. ఇది మొత్తం రెండు రోజుల పాటు కొనసాగనుంది. వర్చువల్ గా సాగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియం రంగంలో పని చేస్తున్న నిపుణులు పాల్గొంటారు.
నేటి నుంచి హైదరాబాద్ (hyderabad)లో రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా (Reimagining Museums in India)సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిని ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (central minister kishan reddy) ప్రారంభించే ఈ సదస్సు రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (azadi ka amrut mahotsav)లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మన కల్చరర్ హెరిటేజ్ (Cultural heritage)ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే మంగళవారం నుంచి రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా సదస్సు హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమం వర్చువల్ (virtual) విధానంలో నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నిపుణులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ప్రజలు కూడా ఈ సదస్సులో వర్చువల్ ద్వారా పాల్గొనవచ్చని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉన్న మ్యూజియంలను తరువాతి జనరేషన్ కు సరిపోయేటట్టు డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ (central government) ఎంతో ఖర్చు చేస్తుందని చెప్పారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 2300 మంది రిజస్టర్ చేసుకున్నారు. ఈ సదస్సు ద్వారా మ్యూజియంల డెవలప్ మెంట్, మెయింటెన్స్ లో కొత్త టెక్నాలజీ ఉపయోగించే విధానం, ప్లానింగ్స్ ను చర్చించనున్నారు. వీటి కోసమే ఈ రంగంలో పని చేస్తున్న, ఆసక్తి ఉన్న వారందరినీ ఒక ప్లాట్ ఫారమ్ పైకి తీసుకువస్తున్నారు. ఇందులో అనేక మంది నిపుణులు మ్యూజియాల కాపాడేందుకు తీసుకోవాల్సిన, అభివృద్ధికి తీసుకోవాల్సి చర్యలు, ఇతర అంశాలు చర్చిస్తారు. అలాగే దేశంలోని మ్యూజియాలను పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తారు.
