తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పలు సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయి. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామన్న అధికారులు.. కొత్త పద్ధతిలోనే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా జీపీఏ వున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ కావడం లేదు. థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్‌లపైనా సందిగ్ధం నెలకొంది. ఇంకా కొన్ని సాంకేతిక సమస్యలు వున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం రెండు వందల ఫీజు వసూలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది.

ఒక్క రోజుకు 24 స్లాట్ బుకింగ్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు అమావాస్య కావడంతో ప్రజల నుంచి స్పందన రాలేదని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

మరోవైపు మూసారాంబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద విక్రయదారులు ఆందోళనకు దిగారు. అటు ఆజంపురా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ సర్వర్లు మొరాయిస్తున్నాయి.