హైదరాబాద్: పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు గెలుపు కాదని ఒక బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. 

ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 32 జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిందని చెప్పుకొచ్చారు. 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం శుభపరిణామమన్నారు. 

ఈ గెలుపు టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయమని చెప్పుకొచ్చారు. 12 జిల్లాలలో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు రాకపోగా, 6 జిల్లాలో ఖాతాయే తెరవలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశచరిత్రలోనే ఇది అపూర్వ విజయంగా  కేటీఆర్ కొనియాడారు. పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.