గోషామహల్  ఎమ్మెల్యే  రాజాసింగ్ కు  మరోసారి బెదిరింపులు వచ్చాయి.  ఇటీవలనే పాకిస్తాన్  నుండి ఆగంతకులు  గుర్తు తెలియని నెంబర్ ద్వారా   బెదిరించారని  రాజాసింగ్  చెప్పారు.

హైదరాబాద్: తనకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు..శుక్రవారం నాడు హైద్రాబాద్ లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తనను చంపుతామంటూ పాకిస్తాన్ నుండి ఆగంతకులు ఫోన్ చేశారని రాజాసింగ్ చెప్పారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ చెప్పారు. పాతబస్తీలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని రాజాసింగ్ ఆరోపించారు.

పాతబస్తీలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. తనను బెదిరించిన ఆగంతకులు ఈ విషయాన్ని చెప్పారన్నారు. టెర్రరిస్టులకు ఆర్ధికంగా , ఫిజికల్ గా ఎంఐఎం సహకరిస్తుందని ఆయన ఆరోపించారు. దేశం కోసం మళ్లీ జైలుకు వెళ్లేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. తనకు జైలు ఫామ్ హౌస్ లాంటిందని ఆయన చెప్పారు.