Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేట మున్సిపల్ వైఎస్ చైర్మెన్ పదవి: టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట మున్సిపల్ వైఎస్ ఛైర్మెన్ పదవి తమ నేతకు దక్కలేదనే కారణంగా ఓ టీఆర్ఎస్ కార్యకర్త బుధవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Reasons behind TRS worker suicide attempt in suryapet
Author
Suryapet, First Published Jan 29, 2020, 11:50 AM IST


సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని బాషా అనే  టీఆర్ఎస్ కౌన్సిలర్ కు వైస్ ఛైర్మెన్ పదవి దక్కనందుకు మనోవేదనతో ఆయన ఓ టీఆర్ఎస్ కార్యకర్త బుధవారం నాడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.  బాషా నివాసంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఇతర కార్యకర్తలు  ఆయనను వారించారు.

Also read:: కరీంనగర్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా సునీల్ రావు

సూర్యాపేట మున్సిపల్ ఛైర్మెన్, వైఎస్ ఛైర్మెన్ ఎన్నిక ఈ నెల 28వ తేదీన జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలోని ఐదవ వార్డు నుండి భాషా అనే టీఆర్ఎస్ నేత  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

భాషాకు సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి దక్కుతోందని ఆయన అనుచరుడు ఒకరు  తీవ్రంగా ఆశలు పెట్టుకొన్నారు.కానీ, సూర్యాపేట మున్సిపల్ వైఎస్ ఛైర్మెన్ పదవిని భాషాకు కాకుండా మరో వ్యక్తికి కట్టబెట్టింది టీఆర్ఎస్ నాయకత్వం. 

బుధవారం నాడు ఉదయం భాషా ఇంట్లో టీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు.ఈ సమావేశం సందర్భంగా  ఓ టీఆర్ఎస్ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  స్థానికులు వెంటనే అతడిని వారించారు..
 

Follow Us:
Download App:
  • android
  • ios