హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో కాల్పుల కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగుడా గ్రామ సమీపంలో స్థిరాస్థి వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ రియల్టర్ మృతిచెందగా.. మరో రియల్టర్ తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో కాల్పుల కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగుడా గ్రామ సమీపంలో స్థిరాస్థి వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ రియల్టర్ మృతిచెందగా.. మరో రియల్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన స్థలంలో మృతిచెందిన వ్యక్తిని శ్రీనివాస్ రెడ్డిగా గుర్తించారు. గాయపడిన రియల్టర్‌ను రాఘవేంద్రరెడ్డిగా గుర్తించారు. గాయపడిన రాఘవేంద్ర రెడ్డి ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చెందిన కారుపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. తనపై కాల్పులు జరిగాయని రాఘవేంద్ర రెడ్డి స్థానికులకు చెప్పాడు. ప్రస్తుతం రాఘవేందర్ రెడ్డికి బీఎన్ రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. వైద్యులు బాధితుడి ఛాతి కింద బుల్లెట్స్ గుర్తించినట్టుగా తెలుస్తోంది.
రియల్టర్స్‌పై కాల్పులు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకన్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాధితులకు ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాఘవేంద్ర రెడ్డి కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
