Asianet News TeluguAsianet News Telugu

మోసంలోనూ నయా ట్రెండ్.. ప్రకటనలతో లక్షల్లో టోకరా..

దీంతో ఆ పేరు తోనే మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.  99ఎకర్స్‌.కామ్, ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లతోపాటు వివిధ క్లాసిఫైడ్స్ లో  విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలను చూసేవాడు. వారికి ఫోన్ చేసి ఆ స్థిరాస్తిని ఖరీదు చేయాలని భావిస్తున్నట్లు చెప్పి బయానాగా కొంత చెల్లించి, వాట్సప్ ద్వారా పత్రాలు షేర్ చేసుకునేవాడు. 

realestate fraud : hyderabad man cheating realtors in rangaredd
Author
Hyderabad, First Published Aug 9, 2021, 10:11 AM IST

రియల్ ఎస్టేట్ ప్రకటనల ఆధారంగా పలువురిని మోసం చేసిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు ఖమ్మం జిల్లా చిన్నారానికి చెందిన ఎస్.నాగరాజు గా గుర్తించారు. వివరాల్లోకి వెడితే..  గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నాగరాజు తీవ్రంగా నష్టపోయాడు. 

దీంతో ఆ పేరు తోనే మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.  99ఎకర్స్‌.కామ్, ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లతోపాటు వివిధ క్లాసిఫైడ్స్ లో  విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలను చూసేవాడు. వారికి ఫోన్ చేసి ఆ స్థిరాస్తిని ఖరీదు చేయాలని భావిస్తున్నట్లు చెప్పి బయానాగా కొంత చెల్లించి, వాట్సప్ ద్వారా పత్రాలు షేర్ చేసుకునేవాడు. 

ఆపై రియల్ఎస్టేట్ సంస్థకు చెందిన బోర్డులపై ఉన్న రియల్టర్ల నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసి.. తానే సదరు స్థలానికి యజమానిని అంటూ పరిచయం చేసుకునే వాడు. తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు చెప్పి  పత్రాలు షేర్ చేసేవాడు. నిజమేనని నమ్మిన రియల్టర్లు అగ్రిమెంట్ చార్జీలు, అడ్వాన్సులు, ఇతర ఖర్చుల పేరుతో లక్షల్లో తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునే వాడు. 

ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. తరువాత అసలు యజమానిని సంప్రదించి  స్థిరాస్తి  ఖరీదు చేయలేకపోతున్నాను అని చెప్పి వారి పత్రాలను వాట్సాప్ ద్వారా తిప్పి పంపి భయానా గా చెల్లించింది వెనక్కి తీసుకునే వాడు.

ఇలా చైతన్యపురి, మీర్‌పేట్‌లతో పాటు సైబర్ క్రైమ్ ఠాణాలో 110 కేసులు నమోదయ్యాయి దీంతో ఏసీబీ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎన్‌.రాము రంగంలోకి దిగారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు నాగరాజుగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios