నిజామాబాద్: అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకొందని కక్ష కట్టి ముగ్గురిని హత్య చేసిన ఉన్మాది రవి ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని చంపిన రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నాడు ఉదయం దోమకొండకు సమీపంలోని గుండ్ల చెరువులో రవి మృతదేహం లభ్యమైంది.

దోమకొండకు చెందిన బందెల బాలయ్య, బందెల రవిలు అన్నదమ్ములు. బాలయ్య పెద్ద కూతురు దీప అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొంది.

దీప వివాహం చేసుకొన్న యువకుడు రవి భార్య తరపున బంధువు. ఈ విషయం రవికి నచ్చలేదు.దీంతో రవి తన కుటుంబాన్ని చంపాలని ప్లాన్ చేశాడు. ఈ నెల 11వ తేదీన తన అన్న బాలయ్య, ఆయన రెండో కూతురు లత, తన 8 ఏళ్ల కూతురు చందనను గ్రామానికి సమీపంలోని మల్లికార్జునస్వామి ఆలయానికి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చాడు.

ఈ కూల్‌ డ్రింక్  తాగిన తర్వాత  కత్తితో లత, బాలయ్య గొంతు కోశాడు రవి. రవి కూతురు చందన అప్పటికే మృతి చెందింది. ఈ ముగ్గురిని హత్య చేసిన రవి ఆ తర్వాత పోలీసులకు కన్పించకుండా పోయాడు.

ఈ వార్త చదవండి

లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపిన ఉన్మాది

పోలీసులు రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ సమీపంలోని గుండ్ల చెరువులో రవి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవి మృతదేహం ఆదివారం  నాడు లభ్యమైంది. ఈ ముగ్గురిని చంపిన తర్వాత రవి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.