మామిడి తోటోల బర్త్ డే పార్టీ పేరిట రేవ్ పార్టీ నిర్వహించారు. దీంట్లో.. యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. కాగా..ఈ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను, సదరు యువకుతలను కూడా అరెస్టు చేశారు. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...హమీద్ ఖాన్ అనే వ్యక్తి జల్ పల్లి పురపాలిక సమీపంలోని ఓ మామిడితోటలోని ఫామ్ హౌజ్ లో తన పుట్టినరోజు వేడుకులు జరుపుకోవాలనుకున్నాడు. శనివారం రాత్రి ఈ పార్టీకి తన మిత్రులను ఆహ్వానించాడు. తన పుట్టిన రోజు పార్టీలో బెల్లా డ్యాన్స్ చేసేందుకు ఈవెంట్ మేనేజర్ సహాయంతో.. కొందరు యువతులతో బేరం కుదుర్చుకున్నాడు.

ఆ యువతులతో డ్యాన్స్ అనంతరం వ్యభిచారం కూడా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తానని హామీ ఇవ్వడంతో.. ఆ యువతులు అర్థరాత్రి ఆ మామిడి తోటకు  చేరుకున్నారు.  రాత్రి ఒంటి గంట సమయంలో పెద్ధ సౌండ్ తో మ్యూజిక్ పెట్టుకొని పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఈ తంతు కనిపించింది.

వెంటనే.. పోలీసులు అర్థనగ్నంగా డ్యాన్స్ లు చేస్తున్న యువతులను .. అక్కడ ఉన్న నలుగురు యువకులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.