విమానంలోకి ఎలుక దూరింది. దానిని పట్టుకోవడానికి విమాన సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ప్రయాణికుల సంగతి మర్చిపోయి.. కష్టపడి ఎలుకను పట్టుకన్నారు. ఈ సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  శంషాబాద్ విమానాశ్రయంలో విశాఖపట్నం వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధమయ్యింది. ఆదివారం ఉదయం ఆరుగంటలకు ఈ విమానం బయలు దేరాల్సి ఉంది. ప్రయాణికులంతా ముందుగానే సమయానికి ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. అయితే... గంటలు గడుస్తున్నా.. ప్రయాణికులను అధికారులు విమానం ఎక్కడానికి ఎనౌన్స్ మెంట్ ఇవ్వడం లేదు.

ఏమిటని ప్రయాణికులు ప్రశ్నించగా... అధికారులు కనీసం స్పందించకపోవడం గమనార్హం.  తొలుత 8గంటలకు విమానం కదులుతుందని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరుతుందన్నారు. చివరకు దాదాపు 11గంటల 30 నిమిషాలకు ఆలస్యంగా విమానం బయలుదేరింది.

ఇంత ఆలస్యానికి కారణం ఓ ఎలుక కావడం గమనార్హం. ఎలుక విమానంలోకి దూరడంతో దానిని గమనించిన సిబ్బంది ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు 10గంటలు శ్రమించిన తర్వాత విమానంలో దూరిన ఎలుకను పట్టుకోగలిగారు. విమానంలో మొత్తం 250మంది ప్రయాణికులు ఉండగా... కాగా అందులో 50మంది వరకు ప్రయాణం రద్దు చేసుకోవడం గమనార్హం.

తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లలేకపోయామని ఒకరు... పరీక్ష రాయలేకపోయామని మరొకరు తమ ఆవేదనను వ్యక్తం చేయడం గమనార్హం.