Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి చెరువులో వింత చేప... చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు (వీడియో)

పెద్దపల్లి జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు వింత చేప చిక్కింది. మునుపెన్నడూ చూడని ఆ చేపను చూసి మత్స్యకారులే కాదు స్థానికులూ ఆశ్చర్యపోతున్నారు.

rare fish found by fisherman in peddapalli district
Author
Peddapalli, First Published Sep 30, 2021, 4:39 PM IST

పెద్దపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. ఇలా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట చెరువు కూడా నిండిపోయింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆ చెరువలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల వింత చేప చిక్కింది. ఇదివరకెన్నడూ చూడని ఆ చేపను చూసి ఆశ్యర్యపోవడం వారి వంతయ్యింది.  

ఇంత వరకు ఇలాంటి చేప చూడలేదని మత్స్యకారులు అన్నారు. ఇలాంటి చేపను చూడడం ఆశ్చర్యంగానే కాదు ఆనందంగా కూడా ఉందని తెలిపారు. వింత చేపను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు మత్స్యకారుని ఇంటి వస్తున్నారు. 

వీడియో

గతంలో ఇదే చెరువులో గోల్డెన్ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఇప్పుడు ఈ అరుదైన చేప చిక్కింది. ఇటీవల భారీ వరదనీరు చేరడంతో చెరువులో నీటిమట్టం పెరిగిందని... ఆ నీటిలోనే ఈ చేప వచ్చివుంటుందని మత్స్యకారులు భావిస్తున్నారు.

read more  జగిత్యాల చెరువులో వింత చేప... మత్స్యకారుడి వలకు చిక్కి.. (వీడియో)

గతంలో జగిత్యాల జిల్లాలో కూడా ఓ మత్స్యకారుడికి ఇలాంటి చేపే చిక్కింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన గొల్లపెళ్లి రాజనర్సుకు దొరికింది. ఈ అరుదైన చేపకు సంబంధించిన వివరాలను జిల్లా మత్య్సశాఖ అధికారులు తెలిపారు. దీనిని డెవిల్(దెయ్యపు) చేప అంటారని... ఇవి ఎక్కువుగా సముద్రంలో ఉంటాయి అని తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని అన్నారు. ఎగువన కురిసిన వర్షాలకు కాలువల ద్వారా వచ్చిఉండొచ్చని తెలిపారు. సరిగ్గా ఇదే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలోనూ జరిగినట్లుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios