చెన్నూరు:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ తాత్కాలిక బస్సు కండక్టర్‌పై ఆర్టీసీ తాత్కాలిక  డ్రైవర్  అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  ఈ విషయం బయటకు రాకుండా రవాణా శాఖాధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుండి గురువారం రాత్రి ఏడున్నర గంటలకు బస్సు మంచిర్యాల వస్తుండగా  బస్సు డ్రైవర్ శ్రీనివాస్  తాత్కాలిక కండక్టర్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో బస్సు కండక్టర్  గట్టిగా కేకలు వేసింది. దీంతో అదే దారి వెంట ప్రయాణిస్తున్నవారు నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకొనే ప్రయత్నం చేశారు.అయితే నిందితుడు శ్రీనివాస్  బస్సును ముందకు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఆర్టీసీ బస్సును జైపూర్ వద్ద ఆపారు. తాత్కాలిక మహిళ కండక్టర్ ను బస్సు నుండి దింపారు. ఆమెను సురక్షితంగా స్వగ్రామానికి తరలించారు. బస్సు డ్రైవర్‌పై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు బాధితురాలు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారు. తాత్కాలిక డ్రైవర్ల కారణంగా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రమాదాలతో పాటు తాత్కాలిక ఉద్యోగులు ఈ తరహా ఘటనలకు పాల్పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 5వ తేదీ నుండి  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులంతా సమ్మె చేస్తుండడంతో తాత్కాలిక  సిబ్బందితో   బస్సులను నడుపుతున్నారు.ఆర్టీసీ కార్మికులతో ఈ నెల 19వ తేదీన చర్చించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.

ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేశారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఆర్టీసీ జేఎసీకి కాంగ్రెస్,బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ వారం రోజులుగా ఆర్టీసీ జేఎసీ, రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలను నిర్వహించాయి.