ఉన్నతాధికారులకు రోజూ ప్రజల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వస్తూనే ఉంటాయి. కానీ, వారికి ఉండే పని ఒత్తిడి వల్ల వాటిని పట్టించుకోని వారు ఎందరో ఉంటారు. కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాత్రం తాను డిఫరెంట్ అని నిరూపిస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏ రైతైనా తనకు భూ సమస్య ఉందని కలెక్టర్ కార్యాలయం మెట్లెక్కితే చాలు ఆ రైతు తనకు సంతృప్తినిచ్చే పరిష్కారంతో ఇంటిబాట పడతాడు. దీనికి కారణం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.

రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏ రైతైనా తనకు ఫలానా సమస్య ఉందని తన వద్దకు వెళితే చాలు వెంటనే ఆ సమస్య పరిష్కారానికి తానే స్వయంగా చొరవ తీసుకొని పరిష్కరించిన సందర్భాలున్నాయి.

ఆ మధ్య ఒక రైతు తన భూమికి సంబంధించిన గోడు వాట్సప్ ద్వారా కలెక్టర్ కి  వెళ్లబోసుకోవటంతో అమయ్ కుమార్ వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారం అయ్యేలా చేశారు. దాంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

కేవలం రైతు సమస్యలే కాకుండా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందులో కొన్ని కబ్జా కోరల్లో చిక్కుకుంటే మరి కొన్ని కోర్టు కేసుల్లో నలిగిపోతున్నాయి.

రంగారెడ్డి కలెక్టర్ వాటన్నిటిని ఒక గాడిన పెట్టి ఎన్నో కోట్ల విలువైన ఆ భూముల్ని ప్రభుత్వపరం అయ్యేలా కృషి చేస్తున్నారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను పరిరక్షిస్తున్నారు.

ఈ క్రమంలో ఎందరో భూ కబ్జాదారులకు, ఎందరో పలుకుబడి గల బడా బాబులకు రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీని వల్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడగలుతున్నారు. 

ఇదిలా ఉండగా రైతుల్లో ప్రధానంగా తమకు సంబంధించిన భూ సమస్యలు తొందరగా పరిష్కారం కావటం లేదనే అసంతృప్తి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యంతో ఇటువంటి జిల్లా పాలనాధికారులు చేస్తున్న కృషితో రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటుండటంతో రైతుల్లోఒకింత సంతోషం వ్యక్తం అవుతుంది.