Asianet News TeluguAsianet News Telugu

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్, కొత్తగూడెం బంద్: అఖిలపక్షం నేతల అరెస్ట్

పాల్వంచలోని తూర్పు బజారులో గల రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు  కారణమైన వనమా వెంకేఠ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావును అరెస్ట్ చేయాలని కోరుతూ ఇవాళ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం బంద్ సాగుతుంది. 

Ramakrishna Family Suicide: police Arrested All party leaders
Author
Hyderabad, First Published Jan 7, 2022, 9:28 AM IST

కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావును  అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నియోజకవర్గం బంద్ సాగుతుంది. ఆందోళన చేస్తున్న  పలు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 3వ తేదీన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోని Palwancha తూర్పు బజారులో Ramakrishna  తన కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామకృష్ణ ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్ల సాహితీ,సాహిత్యలు మరణించారు. తమ ఆత్మహత్యకు  కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama Venkateswara rao కొడుకు Vanama raghavendra rao కారణమని రామకృష్ణ తన సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.  అయితే రామకృష్ణను అరెస్ట్ చేయాలని  all party  నేతలు ఇవాళ kothagudem 
నియోజకవర్గం బంద్‌ నిర్వహిస్తున్నాయి.

కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం బంద్‌ నిర్వహిస్తున్న అఖిలపక్షం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నాడు అర్ధరాత్రే కొందరు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.వనమా రాఘవేందర్ ను  అరెస్ట్ చేయాలని నియోజకవర్గం మొత్తం ఆందోళనలు కొనసాగతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసకొన్న రోజు నుండి వనమా రాఘవేందర్  కన్పించకుండా పోయాడు. రామకృష్ణ ఆత్మహత్యకు తనకు సంబంధం లేదని కూడా వనమా రాఘవేందర్ ప్రకటించారు.  మీడియాకు రిలీజ్ చేసిన వీడియోతో పాటు పలు మీడియో చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని రాఘవేందర్ ప్రకటించారు.

గురువారం నాడు హైద్రాబాద్ లో వనమా రాఘవేందర్ అరెస్ట్ అయినట్టుగా ప్రచారం సాగింది. అయితే రాఘవేందర్ ను తాము అరెస్ట్ చేయలేదని కొత్తగూడెం ఎఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. 

వనమా రాఘవేందర్ ను పోలీసులకు అప్పగిస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా గురువారం నాడు ప్రకటించారు. రామకృష్ణ కేసులో రాఘవేందర్ నిర్ధోషిత్వం తేలేవరకు నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు రాఘవేందర్ ను దూరంగా ఉంచుతానని కూడా వనమా వెంకటేశ్వరరావు  ప్రకటించారు. వనమా రాఘవేందర్ రావు వ్యవహరశైలిపై trs నాయకత్వం కూడా సీరియస్ గా ఉందని సమాచారం. ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం కన్పిస్తుంది.

వనమా రాఘవేందర్ రావుపై పలు కేసులు నమోదయ్యాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి నెల రోజుల ముందే పాల్వంచకు చెందిన ఓ వ్యాపారి కూా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు రాఘవేందర్ రావు కారణమని కూడా ఆ వ్యాపారి సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో బెయిల్ పై వచ్చిన రాఘవేందర్ రామెకృష్ణ కుటుంబం ఆర్ధిక వివాదంలో జోక్యం చేసకొన్నాడు.

 తన భార్యను తీసుకొని హైద్రాబాద్ కు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని రాఘవేందరరావు ఆర్డర్ వేశాడని రామకృష్ణ ఆవేదన చెందాడు. డబ్బులైతే ఇస్తాను కానీ నా భార్యను ఎలా పంపగలని రామకృష్ణ ప్రశ్నించారు. తాను బలైనా కూడా భవిష్యత్తులో మరో కుటుంబానికి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకొంటున్నానని కూడా రామకృష్ణ సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.ఈ సెల్పీ వీడియో బయటకు వచ్చిన తర్వాత రాఘవేందర్ రావును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ చేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios