హైదారాబాద్: కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే మన సంప్రదాయం, సంస్కృతి ఆదర్శనీయం. అన్నా చెల్లెళ్ళు ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకుంటూ, ఒక అపురూప బంధానికి కట్టుబడి ఉంటామని చాటే రక్షా బంధన దినోత్సవం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా జరిగాయి. 

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబుకు హారతిపట్టి స్వీట్లు తినిపించారు. 

మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కు సైతం బీజేపీ మహిళా నేతలు రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టారు. బీజేపీ మహిళా నేతలతోపాటు చిన్నారులు సైతం లక్ష్మణ్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారికి డా.కె.లక్ష్మణ్ స్వీట్లు బహుకరిస్తూ ఆశీర్వదించారు. 

అటు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ కు కూడా ఆ పార్టీ మహిళా నేతలు రాఖీ కట్టారు. రక్షబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి స్వీట్ బాక్స్ లు అందజేశారు కోదండరామ్.