తమ కుటుంబానికి న్యాయం చేయాలని రాజు కుటుంబసభ్యులు కోరుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో  రైల్వేట్రాక్ పై నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్న ఘటన తర్వాత రాజు కుటుంబసభ్యులు కోరుతున్నారు.


హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని రాజు కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఉన్న ఒక్క మగదిక్కు లేకుండా పోయిందని రాజు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.స్టేషన్‌ఘన్ పూర్ సమీపంలో రైల్వేట్రాక్ పై రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషయాన్ని మీడియాలో చూసిన రాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజు భార్య మౌనిక, తల్లి, సోదరి రోధించారు. తన కొడుకును పొట్టనబెట్టుకొన్నారని తల్లి రోధించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:పారిపోయేందుకు యత్నించి,చివరికి ఆత్మహత్య: రాజు సూసైడ్ పై ప్రత్యక్ష సాక్షి

తమకు కూడా న్యాయం చేయాలని రాజు భార్య మౌనిక డిమాండ్ చేసింది. తన భర్త మరణించడంతో తమ కుటుంబం మగదిక్కులేకుండాపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్త లేకుండా జీవించలేనని రాజు భార్య మౌనిక రోదిస్తోంది. 

వినాయకచవితి రోజున ఆరేళ్ల మైనర్ బాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత రాజు కన్పించకుండా పోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెయ్యి మంది పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకొని ఉంటారి పోలీసులు అనుమానిస్తున్నారు.