హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు ప్రొటెం స్పీకర్ పదవి అప్పగించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని  వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎంఐఎం కు చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా రాజ్ భవన్‌లో ఈ నెల 16వ తేదీన ప్రమాణం చేస్తారు.

ఈ నెల 17వ తేదీన ముంతాజ్ అహ్మద్ ఖాన్  ఎమ్మెల్యేలతో  ప్రమాణం చేయిస్తారు. ఎంఐఎంకు చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్  ప్రొటెం స్పీకర్‌గా ఉన్న సమయంలో  తాను అసెంబ్లీకి వెళ్లబోనని ఆయన తేల్చి చెప్పారు.

ఎంఐఎంకు చెందిన సభ్యుడు స్పీకర్ స్థానంలో ఉన్న సమయంలో  తాను అసెంబ్లీకి వెళ్లబోనని తేల్చి చెప్పారు.ఎంఐఎంకు ప్రొటెం స్పీకర్ పదవిని కట్టబెట్టడాన్ని  వెనక్కి తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేస్తే చేయొచ్చు కానీ, తాను మాత్రం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోననిఆయన ప్రకటించారు.