నైరుతి రుతుపవనాల ఆగమనంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, బేగంబజార్‌, హిమాయత్‌నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, మధురానగర్‌, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, చేవెళ్ల, షాబాద్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

కూకట్‌పల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల హోర్డింగ్‌లు నేలకొరిగాయి. చిన్నపాటి వర్షానికే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు వర్షపునీరు భారీగా చేరడంతో అవి చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.