హైదరాబాద్‌లో భారీ వర్షం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల దారి మళ్లింపు

హైదరాబాద్‌లో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. 

rain at Shamshabad airport, flights diverted

హైదరాబాద్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం (hyderabad rain) పడుతోంది. వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో (shamshabad airport) ల్యాండింగ్ కావాల్సిన విమానాలను (flight diversion) అధికారులు దారి మళ్లిస్తున్నారు.  వాతావరణంలో మార్పుల వల్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి - హైదరాబాద్, ఢిల్లీ- హైదరాబాద్ విమానాలు బెంగళూరుకు మళ్లించారు. అలాగే పాట్నా- హైదరాబాద్ విమానం విజయవాకు మళ్లించారు. 

అంతకుముందు నగరంలో ఈరోజు సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట్‌, బాలాపూర్, గుర్రంగూడ‌, ఎల్బీన‌గ‌ర్‌, సంగారెడ్డి, బీహెచ్ఈఎల్ , ఉస్మానియా యూనివ‌ర్సిటీ, రాంన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, నాచారం ప‌రిధిలోనూ వ‌ర్షం కురిసింది. దీంతో ఉద‌యం నుంచి ఉక్క‌పోత‌కు గురైన ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. మరోవైపు అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. దీని ధాటికి ఆలయ గోపురం పై భాగం ధ్వంసమైంది. పిడుగుపడిన సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios