Asianet News TeluguAsianet News Telugu

తప్పిన ప్రమాదం: ఫలక్‌నుమాలో రైల్వేట్రాక్ కింద కుంగిన భూమి

హైద్రాబాద్ పాతబస్తీలో  రైల్వే గార్డు సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది.  రైల్వేగార్డు సమాచారంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

Railway guard sees Landslide under the railway track at Falaknuma in hyderabad
Author
Hyderabad, First Published Aug 19, 2020, 3:55 PM IST


హైదరాబాద్: హైద్రాబాద్ పాతబస్తీలో  రైల్వే గార్డు సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది.  రైల్వేగార్డు సమాచారంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

భారీ వర్షాలకు ఫలక్‌నుమా రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ ట్రాక్ పై సుమారు ఐదు ప్రాంతాల్లో ఇదే తరహాలో భూమి కుంగిపోయింది.  ఇదే ట్రాక్ పై మరో ఐదు నిమిషాల్లో గూడ్స్ రైలు వెళ్లేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన గార్డు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైళ్ల రాకపోకలను మళ్లించారు.

ఈ ట్రాక్ పై గొయ్యి ఏర్పడిన సమయంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు నడవలేదు. ఒకవేళ ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు సాగితే ప్రమాదం జరిగేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 8 మీటర్ల వెడల్పుతో భూమి కుంగిపోయింది.  ట్రాక్ కింద భూమి కుంగిన ప్రాంతం నుండి నీళ్లు వస్తున్నాయి. 

ఈ ప్రాంతంలో అధికారులు గొయ్యి వద్ద మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఏయే ప్రాంతాల్లో భూమి కుంగిపోయిందా అనే  విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల వల్లే భూమి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios