రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం నాడు హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు  రాహుల్‌ దిశా నిర్ధేశం చేయనున్నారు. 


హైదరాబాద్: రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం నాడు హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాహుల్‌ దిశా నిర్ధేశం చేయనున్నారు. 

రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణలో బిజీ బీజీగా గడపనున్నారు. సోమవారం మధ్యాహ్నం రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం పలికారు.

రెండు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పార్టీ ముఖ్యులతో సమావేశమై దిశా నిర్ధేశం చేయనున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో సెటిలర్ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేశారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా రాహుల్ గాంధీ కార్యక్రమాలపై ప్లాన్ చేసింది. మహిళా సంఘాలతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో మహిళా సంఘాల సమస్యలను ఆయన తెలుసుకొంటారు.

తెలంగాణ అమరవీరులకు రాహుల్ గాంధీ నివాళులర్పించనున్నారు. ఈ రెండురోజుల పాటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో రాహుల్ టూర్ నూతనోత్తేజం నింపే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.