ఈ నెల 7 తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో భేటీ: రాహుల్ టూర్ షెడ్యూల్ ఇదీ


తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన వరంగల్ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ నెల 7న హైద్రాబాద్ లో రాహుల్ గాంధీ బిజీ బిజీగా గడుపుతారు.

Rahul Gandhi to visit Telangana on May 6 And 7

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi పర్యటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఈ నెల 6వ తేదీన New Delhi  నుండి రాహుల్ గాంధీ నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి రాహుల్ గాంధీ Warangal  కు చేరుకొంటారు. వరంగల్ లో Congress పార్టీ నిర్వహిస్తున్న సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు

. ఈ సభలోనే Suicide చేసుకొన్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. ఈ సభలోనే తమ ప్రభుత్వ హయంలో రైతులకు ఏం చేసిందనే విషయాలను రాహుల్ గాంధీ వివరించనున్నారు. మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే Farmersకి ఏం చేయనున్నారనే విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రకటించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్  పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ లో సభ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ Hyderabad లో బస చేస్తారు. ఈ నెల 7వ తేదీన  ఉదయం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుండి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.  ఇదే సమావేశ మందిరంలో పలువురు మేధావులతో కూడా రాహుల్ గాంధీ భేటీ అవుతారు. 

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ Gandhi Bhavan కు చేరుకొంటారు. టీపీసీసీ కార్యవర్గంతో రాహుల్ గాంధీ భేటీ అవుతారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో రాహుల్ గాంధీ ఫోటో సెషన్ లో పాల్గొంటారు.  ఈ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు.గాంధీభవన్ నుండి రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుండి ఢిల్లీకి వెళ్తారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios