కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ యాత్ర జోడో యాత్ర  తెలంగాణలో ఇటీవల విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. హుల్ పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సమయంలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ యాత్ర జోడో యాత్ర తెలంగాణలో ఇటీవల విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, వివిధ సంఘాలు, విద్యార్థులు, కార్మికులు.. పెద్ద ఎత్తున పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ రాహుల్ ముందుకు సాగారు. యాత్ర సాగుతున్న సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాల గురించి రాహుల్ తెలుసుకున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే రాహుల్ పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సమయంలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్న వేళ విరామ సమయంలో రాహుల్ గాంధీ పార్టీ నాయకులతో కలిసి బొంగులో చికెన్ వండారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ కుటుంబంతో కలిసి భద్రాచలం ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన బ్యాంబూ చికెన్‌ను రాహుల్ గాంధీ వండినట్టుగా కాంగ్రెస్ పార్టీ పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కుటుంబం, భద్రాచలం నుంచి వచ్చిన బృందం ఇష్టా గోష్ఠిగా మాట్లాడినట్టుగా తెలిపింది. 

Scroll to load tweet…

ఆందోల్ నియోజకవర్గంలో భారత్ జోడో యాత్రలో సాగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. జోగిపేట మండలం దానంపల్లి వద్ద భద్రాచలం నుంచి వచ్చిన ఆదివాసీ మహిళలు, టీ కాంగ్రెస్ నాయకులతో కలిసి బొంగులో చికెన్ వండుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా బొంగులో చికెన్‌ను సిద్దం చేసేందుకు.. చికెన్ ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు, ఇతర పదార్థాలను రాహుల్ స్వయంగా కలిపారు. తర్వాత దానిని వెదురు కర్రలో కూడా ఉంచారు. ఆదివాసీ మహిళలు, రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు వంటకం తిన్న రాహుల్ గాంధీ వారితో సంభాషించడం కూడా కనిపించింది. అలాగే వారికి స్వయంగా రాహుల్ వడ్డించడం కూడా వీడియోలో కనిపించింది. 


ఈ సందర్భంలో రాహుల్ టీ కాంగ్రెస్ నేతలతో సరదాగా సంభాషించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక యాత్ర సాగిస్తున్న సమయంలో ప్రతి రాష్ట్రంలో ఇద్దరు, ముగ్గురు నాయకులు అలిసిపోయి పడిపోయారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారు. ‘‘మొత్తం బృందంగా ఉన్నప్పుడు.. పనిని పూర్తి చేయడం చాలా సులభం. ఈ కార్యాచరణ మొత్తం సందేశాన్ని కలిగి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఐక్యంగా ఉంటేనే మెరుగైన పనితీరు కనబరుస్తాం. అంటే మేమే అధికారంలోకి వస్తాం’’ అని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోలో మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క.. తదితరులు కనిపించారు.

ఇక, తెలంగాణలో అక్టోబరు 23 నుంచి నవంబర్ 7 వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగింది. రాష్ట్రంలోని 19 అసెంబ్లీ, ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో దాదాపు 370 కిలోమీటర్ల మేర నడిచారు.