చిన్నారులకు చ్లాకెట్లు, టిఫిన్ సెంటర్లో దోశ తయారీ: జగిత్యాల జిల్లాలో సందడి చేసిన రాహుల్ గాంధీ (వీడియో)

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  జగిత్యాలకు వెళ్లే మార్గమధ్యలో నూకపల్లి వద్ద సందడి చేశారు.  రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ లో  రాహుల్ గాంధీ దోశ వేశారు.
 

Rahul Gandhi makes dosa at roadside eatery in Jagtial district lns

హైదరాబాద్: కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా మూడో రోజున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ సామాన్యుడిగా  రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ లో దోశ వేశాడు. అదే టిఫిన్ సెంటర్ వద్ద రాహుల్ గాంధీ టిఫిన్ తిన్నారు. తాను తయారు చేసిన దోశను టిఫిన్ సెంటర్ యజమానికి తినిపించారు రాహుల్ గాంధీ. టిఫిన్ సెంటర్ యజమాని కూడ రాహుల్ కు దోశ తినిపించారు.

 

శుక్రవారంనాడు కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే సమయంలో  మార్గమధ్యలోని  నూకపల్లి బస్టాండ్ వద్ద  రాహుల్ గాంధీ  సందడి చేశారు.  బస్టాండ్ కు సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లి దోశ వేశారు.  దోశ తయారీ గురించి టిఫిన్ సెంటర్ యజమాని నుండి సలహాలు తీసుకుంటూ  దోశ వేశారు. తాను తయారు చేసి దోశను టిఫిన్ సెంటర్  యజమానితో పాటు కాంగ్రెస్ నేతలకు  రుచి చూపించారు.  ఆ తర్వాత రాహుల్ గాంధీ అదే టిఫిన్ సెంటర్ వద్ద దోశ తిన్నారు. టిఫిన్ సెంటర్ ఆదాయం, ఖర్చుల గురించి  రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు.

also read:మా పార్టీ నేతలంతా పులులే... కేసీఆర్ ఆటకట్టిస్తారు: జగిత్యాలలో రాహుల్ గాంధీ

ఆ తర్వాత అదే మార్గంలో వెళ్లే ఓ వాహనం ఆపి  స్థానికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఓ ద్విచక్రవాహనంపై వెళ్లే వారిని ఆపి మాట్లాడారు.  చిన్నారులకు చ్లాకెట్లు పంచారు. మరో వైపు మధ్యాహ్నం మోర్తాడ్ లో సభ ముగించుకొని  ఆర్మూర్ కు వెళ్లే సమయంలో  రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ లో రాహుల్ గాంధీ ఆగారు.  ఆ హోటల్ లో ఉన్న స్థానికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. టీ స్టాల్ లో  బజ్జీలు ఆర్డర్ ఇచ్చారు.  అందరికీ బజ్జీలు అందించారు.  స్థానికులతో కలిసి టీ తాగారు. స్థానికంగా ఉన్న సమస్యలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios