కుంగిన మేడిగడ్డ బ్యారేజీ: పరిశీలించిన రాహుల్ గాంధీ
కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
భూపాలపల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారంనాడు ఉదయం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఇవాళ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీ కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు పరిశీలించారు.
ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజి వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ మేడిగడ్డ బ్యారేజీ వైపునకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.బ్యారేజీకి చెందిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి.ఈ బ్యారేజీ పై నుండి తెలంగాణ, మహారాష్ట్రకు రాకపోకలు సాగుతాయి. అయితే బ్యారేజీ కుంగిపోవడంతో రాకపోకలను నిలిపివేశారు. ఈ బ్యారేజీ కుంగిపోవడంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృంధం పరిశీలించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది.
ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. రెండు రోజుల పాటు అనిల్ జైన్ నేతృత్వంలోని టీమ్ రాష్ట్రంలో పర్యటించింది. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ విషయమై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నీటి పారుదల శాఖ అధికారులకు కొన్ని ప్రశ్నలను సంధించింది.ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరింది.
also read:కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. రాహుల్ గాంధీ
ఇవాళ ఉదయం హెలికాప్టర్ లో అంబట్ పల్లి గ్రామానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. మహిళా సాధికారిత సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీని రాహుల్ గాంధీ పరిశీలించారు.