భార్యపై అనుమానంతో   ఓ లాడ్జీలో   ఆమెను హత్య చేసి దుబాయ్‌కు పారిపోయాడు నిందితుడు ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది. 


హైదరాబాద్: భార్యపై అనుమానంతో ఓ లాడ్జీలో ఆమెను హత్య చేసి దుబాయ్‌కు పారిపోయాడు నిందితుడు ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన రహీం పెళ్లి చేసుకొన్న తర్వాత దుబాయ్‌ వెళ్లిపోయాడు.ఆ తర్వాత కొంతకాలానికి ఆయన తిరిగి ఇండియాకు వచ్చాడు. భార్యతో కొంత కాలం కాపురం చేసిన తర్వాత ఆయన మళ్లీ దుబాయ్ కు వెళ్లిపోయాడు.

అయితే రహీం స్నేహితులు ఆయన భార్య మరోకరితో తిరుగుతోందని సమాచారాన్ని ఇచ్చారు. దీంతో అనుమానంతో ఆయన రగిలిపోయాడు.మంగళవారం నాడు ఆయన దుబాయ్‌ను ఇండియాకు వచ్చాడు. తాను వచ్చే సమయానికి భార్యను గద్వాల నుండి హైద్రాబాద్‌కు రప్పించుకొన్నాడు. 

సికింద్రాబాద్‌ లాడ్జీలో రూమ్‌ తీసుకొన్నాడు. రాత్రి అక్కడే బస చేశారు. రాత్రి పూట భార్యను చున్నీతో ఉరివేసి చంపేశాడు.బుధవారం నాడు ఉదయం పూట ఈ విషయాన్ని రహీం పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు భార్యను చంపేసి అతను దుబాయ్‌కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.మృతురాలి బంధువులకు కూడ సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.