Asianet News TeluguAsianet News Telugu

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెక్యూరిటీ వద్ద రబ్బరు బుల్లెట్లా?, కేసు పెట్టాలి: రఘునందన్ రావు


స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించేందుకు గాను తుపాకీతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడంపై కేసు నమోదు చేయాలని  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు

Raghunandan Rao Demands To File Case Against Minister Srinivas Goud
Author
Hyderabad, First Published Aug 14, 2022, 11:53 AM IST

హైదరాబాద్: స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించేందుకు గాను  తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లేకపోతే తాము హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలన్నారు.

ఆదివారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వ్యక్తిగత సిబ్బంది నుండి బుల్లెట్లు లోడ్ అయిన ఆయుధాన్ని తీసుకొని గాల్లోకి కాల్పులు జరపడాన్ని తప్పు బట్టారు ఇండియన్ ఆర్మ్ యాక్ట్ ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరిపే సమయంలో పొరపాటున మిస్ ఫైర్ అయితే  అక్కడే ఉన్న ప్రజలపైకో లేదా ఎస్పీ, కలెక్టర్లతో పాటు అధికారులపైకి బుల్లెట్లు దూసుకు వస్తే ఏం చేసేవారని ఆయన ప్రశ్నించారు. ఫైరింగ్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఏమైనా అనుభవం ఉందా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ లైసెన్స్ ఉందా అని కూడ  అడిగారు. మంత్రి ప్రతి రోజూ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారా చెప్పాలన్నారు. ఎస్ఎల్ఆర్, కార్బన్ , ఇన్సాస్ లు అన్నీ కూడా రిపీట్ అనే మోడ్ లో పెట్టి ఉంటే మ్యాగ్జిన్ లో ఉన్న బుల్లెట్లు ఖాళీ అయ్యే వరకు ఫైరింగ్ అవుతూనే ఉంటుందన్నారు. ఒక వేళ మ్యానువల్ మోడ్ లో పెడితే  రెండు లేదా ఐదు బుల్లెట్లు ఫైర్ అవుతుందని ఆయన చెప్పారు. 

ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా ప్రైవేట్ వ్యక్తులకు తుపాకీ ఇచ్చి ఫైరింగ్ చేయమని ఎక్కడ ఉందో చెప్పాలని డీజీపీని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసు  సిబ్బంది వద్దత తుపాకీ తీసుకొని కాల్పులకు దిగితే ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఆరు మాసాల తర్వాత డీజీపీగా మహేందర్ రిటైర్ కానున్నారన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత డీజీపీకి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు అనే పదవి ఇవ్వనుందనే ఈ విషయమై డీజీపీ నోరు మెదపడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. 

చట్టం ముందు అందరూ సమానమని డీజీపీ భావిస్తే  నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ చేసిన తుపాకులను సీజ్ చేయలేదో చెప్పాలన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసు సిబ్బంది నుండి తుపాకీ తీసుకొని గాల్లోకి కాల్పులు జరపడం నేరమని రఘునందన్ రావు. ఐపీసీ 336 సెక్షన్ ప్రకారంగా  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  ఇండియన్ ఆర్మ్మ్ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను  శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలన్నారు.  ఇప్పటి వరకు ఈ తుపాకులను ఎందుకు సీజ్ చేయలేదో చెప్పాలన్నారు. అయితే నిన్న సాయంత్రానికి రబ్బరు బుల్లెట్లు వాడారని కొత్త కథను తెరమీదికి తీసుకు వచ్చారని చెప్పారు. 

మంత్రి వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి ఇచ్చిన ఆయుధాల్లో రబ్బరు బుల్లెట్లు ఉన్నాయా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.  ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం ఇస్తున్న భద్రతా సిబ్బందికి అందించే ఆయుధాల్లో రబ్బరు బుల్లెట్లు ఇస్తున్నారో చెప్పాలని ఆయన డీజీపీని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపేందుకు కుట్ర జరిగిందని ఇటీవలనే కొందరిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. స్పెషల్ ఎస్కార్ట్ తో పాటు  అదనపు భద్రతా సిబ్బందిని ఇచ్చిన విషయాన్ని రఘునందన్ రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రాణ హాని ఉందన్న మంత్రి వద్ద నియమించిన భద్రతా సిబ్బందికి రబ్బరు బుల్లెట్లు ఇచ్చారా అని రఘునందన్ రావు అడిగారు.

ఎస్పీ సమక్షంలో మంత్రి ఆయుధంతో గాల్లోకి కాల్పులు జరిపితే ఇంతవరకు ఎందకు తుపాకీని సీజ్ చేయలేదో చెప్పాలన్నారు.  ఈ తుపాకీలో ఉన్నవి రబ్బరు బుల్లెట్లా ఒరిజినల్ బుల్లెట్లా అనేది నిర్ధారించేందుకు క్యాడ్రిట్జ్ లు సీజ్ చేయలేదని రఘునందన్ రావు చెప్పారు. మంత్రి కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదన్నారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. 

మంత్రి సిఫారసు చేస్తేనే జిల్లాకు ఎస్పీ పోస్టింగ్ ఇస్తున్నారన్నారు.అలాంటి తరుణంలో మంత్రికి వ్యతిరేకంగా ఎస్పీ ఎలా నివేదిక ఇస్తారని ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీని అడిగారు.ఈ విషయమై డీజీపీ స్పందించకపోతే తాము హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేస్తామన్నారు.క్రీడా పోటీలను ప్రారంభించాలంటే  రబ్బరు బుల్లెట్లు ఉన్న తుపాకీని అక్కడ ముందుగానే ఏర్పాటు   చేయాలన్నారు. మూడు రోజుల క్రితం కూడా ఇలానే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరింగ్ చేస్తే కేసు నమోదు చేయకపోవడంతో మరోసారి ఇలా చేశారని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. సీఐ, డీఎస్పీ వంటి అధికారులు తప్పులు చేస్తే వెంటనే పోలీసులు చర్యలు తీసుకొంటున్నారన్నారు. కానీ తప్పు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

also read:నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్.. స్పోర్ట్స్‌ మీట్స్‌లో ఇది కామనే : గన్ ఫైరింగ్‌పై శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ

ఫ్రీడమ్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించే  సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరింగ్ చేశాడు.ఈ విషయమై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. తాను ఉపయోగించిన తుపాకీలో రబ్బరు బుల్లెట్లున్నాయన్నారు. స్పోర్ట్స్  మీట్ ను ప్రారంభంలో ఇలా కాల్పులు జరపడం సాధారణమేనని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios