ఓయూ నకిలీ సర్టిఫికెట్ల కేసు: ముద్దం స్వామి కోసం ఎల్ఓసీ జారీ చేసిన రాచకొండ పోలీసులు
ఓయూకు చెందిన నకిలీ సర్టిఫికెట్ల తయారీపై రాచకొండ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అమెరికాలో ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని గుర్తించారు. అమెరికాలో ఉన్న ముద్దం స్వామని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్: ఓయూకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు తయారీ అంశంపై రాచకొండ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అమెరికాలో ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్టుగా రాచకొండ పోలీసులు గుర్తించార. ముద్దం స్వామి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి పంపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ముద్దం స్వామని ఇండియాకు రప్పించేందుకు నాచారం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇంటర్ నెట్ ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ సర్టిపికెట్లు అందిస్తున్నారని రాచకొండ పోలీసులు గుర్తించారు. గత ఏడాది నకిలీ సర్టిఫికెట్ ద్వారానే ముద్దం స్వామి అమెరికాకు వెళ్లాడని రాచకొండ పోలీసులు గుర్తించారు. అమెరికాలో ఉన్న ముద్దం స్వామిని రాష్ట్రానికి రప్పించేందుకు ఎల్ఓసీ ని జారీ చేశారు నాచారం పోలీసులు. ముద్దం స్వామిని అదుపులోకి తీసుకొంటే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఈ కథనం తెలిపింది. నకిలీ సర్టిఫికెట్లతో పలువురు విదేశాలకు వెళ్లినట్టుగా గుర్తించారు.
గతంలో కూడ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు యూనివర్శిటీలకు చెందిన సర్టిఫికెట్లను విక్రయించారు. అయితే రాధాకృష్ణ యూనివర్శిటీకి చెందిన సర్టిఫికెట్ల జారీ లో ఇద్దరు మాజీ వీసీలతో పలువురిని హైద్రాబాద్ పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్శిటీలో వీసీలుగా పనిచేసిన ఇద్దరిని ఈ ఏడాది మే 16న హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ యూనివర్శిటీ నుండి పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ట్టుగా పోలీసులు గుర్తించారు. వందల సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులు విదేశాలకు కూడా వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.
రాధాకృష్ణ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను కూడా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధానంగా పీకే వీరన్నస్వామి వ్యవహరించారని పోలీసులు ప్రకటించారు