వనస్థలిపురం దోపీడీ కేసులో ట్విస్ట్: హవాలా డబ్బుల కోసమే దోపీడీ డ్రామా


హైద్రాబాద్ లోని వనస్థలిపురం  దోపీడీ కేసులో  ట్విస్ట్  చోటు చేసుకుంది.  హవాలా డబ్బు కోసమే  దోపీడీ జరిగిందని  డ్రామా ఆడినట్టుగా  పోలీసులు గుర్తించారు. 

Rachakonda Police  found  Hawala  money  in vanasthalipuram robbery case

హైదరాబాద్:  హైద్రాబాద్ వనస్థలిపురం  దోపీడీ కేసులో  ట్విస్ట్ చోటు  చేసుకుంది.  హవాలా డబ్బుల కోసమే దోపీడీ జరిగిందని  మూడు రోజుల క్రితం  వెంకట్ రెడ్డి అనే వ్యక్తి  పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్న  సమయంలో  హవాలా  వ్యవహరం వెలుగు చూసింది.  అమెరికాలో  ఉన్న ప్రవీణ్ కుమార్ కు డబ్బులు ఎగ్గొట్టేందుకు  గాను  వెంకట్ రెడ్డి  దోపీడీ డ్రామా ఆడినట్టుగా పోలీసులు గుర్తించారు.  

గత ఆరు మాసాలుగా  అమెరికాలో  ఉన్న ప్రవీణ్  రూ.  28 కోట్లను పంపినట్టుగా  పోలీసులు గుర్తించారు.  రాచకొండ పోలీసులు  వెంకట్ రెడ్డి నివాసంలో  సోదాలు చేసి రూ. 2.75 కోట్ల  హవాలా నగదును సీజ్ చేశారు. రియాసత్ నగర్ కు  చెందిన ఫారూక్ తో  కలిసి హవాలా లావాదేవీలు.నిర్వహించినట్టుగా  పోలీసులు గుర్తించారు.  ప్రవీణ్, వెంకట్ రెడ్డి,  ఫారూఖ్ ల  హవాలా లావాదేవీలపై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.ఈ నెల  7వ తేదీన  వెంకట్ రెడ్డి  వనస్థలిపురం పోలీసులకు  దోపీడీ జరిగిందని  ఫిర్యాదు చేశారు.  తన మద్యం దుకాణాలకు సంబంధించి  డబ్బులను తీసుకెళ్తున్న సమయంలో  కొందరు దుండగులు  తనను ఆటకాయించి   డబ్బులను తీసుకెళ్లారని వెంకట్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు దర్యాప్తు  చేశారు.  ఈ దర్యాప్తులో హవాలా వ్యవహరం వెలుగు చూసింది.  

వెంకట్ రెడ్డి  నివాసంలో  పోలీసులు  చేసిన  సోదాల సమయంలో  డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ డైరీలో హవాలాకు సంబంధించిన  సమాచారం  ఉన్నట్టుగా  తెలుస్తుంది.  మరో వైపు  ఫారూఖ్ నివాసంలో  కూడా  పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఈ అంశానికి సంబంధించి  పోలీసులు ఆదాయ పన్ను శాఖాధికారులకు  కూడా సమాచారం ఇచ్చారు.  హవాలా  రూపంలో  డబ్బులను  ఎవరెవరికీ పంపారనే  విషయమై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios