ఆత్మహత్యగా భావిస్తున్నాం: రాజేష్, సుజాతల మృతిపై రాచకొండ సీపీ
రాజేష్, టీచర్ లు పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నామని రాచకొండ సీపీ చౌహన్ చెప్పారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు.
హైదరాబాద్: రాజేష్, టీచర్ సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని తాము అనుమానిస్తున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ చెప్పారు.గురువారంనాడు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. హయత్ నగర్ కుంట్లూరు వద్ద రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రాంతంలో బీటెక్ స్టూడెంట్ రాజేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయమై విచారణ చేసిన సమయంలో టీచర్ సుజాతతో రాజేష్ కు సంబంధం ఉన్న విషయం వెలుగు చూసిందన్నారు. మిస్ట్ కాల్ తో రాజేష్ తో సుజాత్ కు మధ్య పరిచయం ఏర్పడిందన్నారు.
సుజాతకు భర్త, ముగ్గురు పిల్లలున్నారన్నారని సీపీ చెప్పారు. ఈ బంధం కొనసాగించలేక సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని సీపీ చెప్పారు. పురుగుల మందు తాగి సుజాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ కు వచ్చిన మేసేజ్ లు,ఫోన్లతో రాజేష్ ను కుటుంబ సభ్యులు గుర్తించారన్నారు.కలిసి బతకలేక చనిపోదామని ఇద్దరు నిర్ణయించుకున్నారని అనుమానిస్తున్నట్టుగా డీఎస్ చౌహన్ చెప్పారు. తొలుత సుజాత పురుగుల మందు తాగిందన్నారు. సుజాత కొడుకు ద్వారా ఈ విషయం రాజేష్ కు తెలిసిందన్నారు
also read:నా భార్య మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి: టీచర్ సుజాత భర్త నాగేశ్వరరావు
సుజాత ఇంటి పరిసర ప్రాంతానికి వచ్చిన రాజేష్ ను సుజాత కొడుకు చెంప దెబ్బ కొట్టాడని సీపీ వివరించారు. రాజేష్ శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు వీరిద్దరూ ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా భావిస్తున్నామని సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని డీఎస్ చౌహన్ తెలిపారు