హైదరాబాద్: అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు.

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర కేబినెట్ సోమవారంనాడు నిర్ణయం తీసుకొంది. ఈ విషయమై కృష్ణయ్య తీవ్రంగా స్పందించారు.
ఇష్టమొచ్చినట్టు రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరన్నారు. 

రిజర్వేషన్లను 60 శాతానికి పెంచుతామంటే ఊరుకోబోమని చెప్పారు. కేంద్ర కేబినెట్ తీసుకొన్న నిర్ణయంపై ఆందోళనలను నిర్వహిస్తామని కృష్ణయ్య చెప్పారు.
మోడీకి దమ్ముంటే జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆయన ఆరోపించారు.