హైదరాబాద్‌లో మరో మల్టీలెవల్ మోసం వెలుగుచూసింది. క్యూనెట్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు కంపెనీని స్థాపించారు. తక్కువ పెట్టుబడితో పాటు... ఖాళీ సమయాల్లో పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి జనం దగ్గర లక్షల్లో వసూలు చేసి మొత్తం రూ. 3 వేల కోట్లతో బోర్డు తిప్పేశారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులున్నారు.