కాంగ్రేస్ పార్టీ పీపుల్స్ షార్జ్ షీట్ ఫేక్. తెలంగాణ కంటే కాంగ్రేస్- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకం ఎక్కువగా ఉందన్నారు. బెల్టుషాపులకు కర్త- కర్మ- క్రియ కాంగ్రేస్ పార్టీనే అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కానీ బటన్ మాత్రం చంద్రబాబు అని, రేవంత్ నైజం ఏంటో శశిథరూర్ పై బూతుపురాణం చూస్తే అర్థం అవుతుందన్నారు.
పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు తెలంగాణ భవన్ లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు పోయి రాగానే ఆగమేఘాల మీద కాబోయే ప్రధానులు అని చెప్పుకునే నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు.
కాంగ్రేస్ పార్టీ పీపుల్స్ షార్జ్ షీట్ ఫేక్. తెలంగాణ కంటే కాంగ్రేస్- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకం ఎక్కువగా ఉందన్నారు. బెల్టుషాపులకు కర్త- కర్మ- క్రియ కాంగ్రేస్ పార్టీనే అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కానీ బటన్ మాత్రం చంద్రబాబు అని, రేవంత్ నైజం ఏంటో శశిథరూర్ పై బూతుపురాణం చూస్తే అర్థం అవుతుందన్నారు.
తెలంగాణ విమోచనదినం ఒక విషాద సంఘటన అని అన్నారు. తెలంగాణకు జూన్ 2 ఉంది కదా అని గుర్తు చేశారు. ప్రజలు సంతోషంగా ఉండేలా పథకాలు అమలు చేస్తున్నందుకు షార్జ్ షీట్ వేస్తారా? దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్న నగరంలోకి టాప్ 5లో తెలంగాణ ఉందని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మెదక్ ఎంపీ, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ లో కాంగ్రేస్ మీటింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు.అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసేలా కాంగ్రేస్ నేతల మాటలు ఉన్నాయి.గజ్వేల్ కి రైల్ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ కాదా? అధికారం కోల్పోయి 10ఏళ్ళు అవుతుందని ఆక్రోశంతో కాంగ్రేస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పల్లెను వదిలిన ప్రతీ ఒక్కరూ- కేసీఆర్ పాలనలో మళ్ళీ పల్లెకు చేరారు. కేసీఆర్- టీఆరెస్ ను తిట్టడం తప్ప వేరే ఆలోచన వాళ్లకు లేదని మండిపడ్డారు.
ఎవడో పిచ్చోడు ఈడీకి లేఖ రాశాడు: డ్రగ్స్ ఇష్యూపై కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు
ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. 8ఎకరాల్లో 2లక్షల మంది ఎట్లా పడతారు? 2లక్షల మంది వచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటా! 2లక్షల మంది రానట్లు అయితే పీసీసీ కి రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్నారు. రేవంత్ రెడ్డి తో నేను 8ఏళ్ళు పనిచేశాను- ఆయన ఒక డ్రామా కంపెనీ. జై కొట్టే వాళ్ళు- విజిల్ వేసే వాళ్ళు ఆయన మనుషులే వుంటారని ఎద్దేవా చేశారు.
రేవంత్ కి దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి. పథకాల పై విమర్శలు చేసే ప్రతి కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ కు 35వేల మంది ఉంటే- టీఆరెస్ పార్టీ 61లక్షల మంది సభ్యత్వం ఉంది. గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పారు. సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు భయపడి తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు.
