ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ దర్శనికత వల్ల పేదలకు వైద్యం భారం కావడం లేదని అన్నారు. మంచి సేవలు అందిస్తున్న డాక్లర్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ లో గడిచిన 6 నెలల్లో 50 మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు, , గడిచిన 60 రోజుల్లో 250 గుండె సంబంధిత ఆపరేషన్లు జరిగాయని తెలియజేస్తూ ఓ తెలుగు దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన షేర్ చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా డాక్టర్లకు, ఇతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
‘‘ ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లలో అందిస్తున్నది. గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి ఆపరేషన్లు, 60 రోజుల్లో 250 హృద్రోగ చికిత్సలు జరగడం సర్కారు దవాఖానాలపై ప్రజల నమ్మకానికి నిదర్శనం. ’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘‘ సీఎం కేసీఆర్ గారి దార్శనికత పేదలకు మోయలేని భారాన్ని తగ్గిస్తున్నది. ఉస్మానియా ఆసుపత్రి సూపరిటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు. ఉస్మానియాలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీంతో అత్యాధునిక వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.
