సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండలం, వెళ్లటూరు గ్రామంలోని పోలింగ్ బూత్ 139లో పోలింగ్ బూత్ లో ఓ అధికారిపై కొందరు స్థానికులు దాడి చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చెప్పినట్టు కాకుండా సొంతంగా ఆ అధికారి ఓటు వేస్తున్నట్లు గుర్తించి దాడి చేశారు. 

కొందరు అధికారులు వృద్ధులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఓటు ఎలా వేయాలో చెబుతామని చెప్పి వృద్ధులకు బదులు అధికారులే వారికి నచ్చిని వారికి ఓటు వేస్తున్నారని దాడి చేశారు. 

దీంతో ఒక్కసారిగా పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.