హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఓ పబ్ డ్యాన్సర్ పై హైదరాబాదులోని అమీర్ పేట ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తూ దాడికి దిగారు. 

పబ్ డ్యాన్సర్ తనపై జరిగిన దాడిపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివస్త్రను చేసి, తనను కొట్టారని ఆమె ఆరోపించింది. ఓ పురుషుడితో పాటు నలుగురు మహిళలు తనపై దాడికి దిగినట్లు తెలిపింది.

తన శరీరంపై బ్లేడుతో గాట్లు పెట్టారని ఆరోపించింది. వ్యభిచారం చేయాలని పబ్ నిర్వాహకులు తనపై ఒత్తిడి చేశారని, వ్యభిచారం చేస్తే రోజుకు పది వేల రూపాయలు వస్తాయని ఒప్పించే ప్రయత్నం చేశారని. అయితే తాను అందుకు అంగీకరించలేదని ఆమె చెప్పారు. 

తమ వెనక చాలా పెద్ద వాళ్లు ఉన్నారని కూడా బెదిరించినట్లు ఆమె తెలిపింది. తన ఫోన్ ను పగులగొట్టారని, తన వద్ద ఉన్న గొలుసును కూడా లాక్కున్నారని ఆమె చెప్పింది.