Asianet News TeluguAsianet News Telugu

ఆస్తి తగాదాలు : హైదరాబాద్ వ్యాపారి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్..

హైదరాబాద్ లో మూడు రోజుల క్రితం జరిగిన ఓ వ్యాపారి హత్య కేసులో పోలీసులు మంగళవారం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Property disputes : Five arrested in Hyderabad businessman's murder case - bsb
Author
First Published Sep 13, 2023, 10:05 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జవహర్‌నగర్‌లో వ్యాపారి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. వ్యాపారి హత్యకు గురైన మూడు రోజుల తర్వాత ఈ కేసులో పోలీసులు మంగళవారం ఐదుగురిని అరెస్టు చేశారు. ఆస్తి తగాదాలే హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియల్టర్ వేణుగోపాల్ (42) హత్య కేసులో.. పి లక్ష్మణ్ (54), అతని కుమారుడు పి పవన్ (26), ఎస్ సురేష్ (23), జి జగదీష్ (26), డిగ్రీ స్టూడెంట్ ఎం సాయి కిరణ్ (23)లను అరెస్టు చేశారు. వీరంతా పవన్ స్నేహితులు.

2011లో మాజీ సైనికోద్యోగి భార్య సత్యవతి నుంచి వేణుగోపాల్ తండ్రి శ్రీశైలం, లక్ష్మణ్ తదితరులు 10 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత బాధితుడికి, లక్ష్మణ్‌కు మధ్య వివాదం మొదలైంది. తదనంతరం, వివాదానికి కారణమైన లక్ష్మీనారాయణ పత్రాన్ని రద్దు చేయాలని లక్ష్మణ్ రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. లక్ష్మీ నారాయణ పక్షపాతం చూపిస్తున్నాడని, వేణుగోపాల్‌కు మద్దతు ఇచ్చాడని తెలిపాడు.

కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది: కిష‌న్ రెడ్డి

అనంతరం లక్ష్మణ్‌, పవన్‌లను వేణుగోపాల్‌ బెదిరించాడు. దీంతో కోపానికి వచ్చిన పవన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వేణుగోపాల్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే శనివారం నిందితులు వేణుగోపాల్‌ను వెంబడించి బైక్‌ను ఢీకొట్టారు. వేణుగోపాల్ కిందపడిపోవడంతో నిందితులు అతని గొంతు కోసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios