Revanth Reddy Assets : రేవంత్ రెడ్డి మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా ?
Anumula Revanth Reddy Assets : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. దీంతో తెలంగాణ రెండో సీఎంగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. అయితే కొత్త ముఖ్యమంత్రికి ఉన్న ఆస్తులెన్నీ.. ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల విలువెంతా ? అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.
telangana new cm anumula revanth reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసింది. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ సారి ప్రతిపక్షంలో కూర్చోనుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నించి బీజేపీ కేవలం 8 స్థానాలు గెలుచుకొని, మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే ఎంఐఎం తన 7 స్థానాలను పదిలపర్చుకుంది.
కాంగ్రెస్ కు మెజారిటీ దక్కడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. దీంతో ఆయనే తెలంగాణకు కాబోయే సీఎం అని స్పష్టమయ్యింది. పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి పుంజుకునేలా చేసిన రేవంత్ రెడ్డికే సీఎం పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ ఆసక్తి చూపింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే రెండో ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు నెలకొల్పనున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ఆస్తులెంతా అనే వివరాలను తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ‘మై నేత్ర’ (My Neta) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన నికర ఆస్తుల విలుల రూ.30 కోట్లుగా ఉంది. రేంత్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఆయన వద్ద రూ.5,34,000 నగదు ఉంది. అలాగే రేవంత్, ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద కలిపి వున్న స్థిర , చర ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా ఆయన ప్రకటించారు.
రేవంత్ దంపతుల పేర్ల మీద రూ.1,30,19,901 మేర అప్పులు ఉన్నాయి. ఆయన వద్ద ఒక హోండా సిటీ, మరో మెర్సిడిస్ బెంజ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి భార్య వద్ద రూ. 83,36,000 విలువైన 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు.. రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా వున్నట్లు రేవంత్ రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా.. రేవంత్ రెడ్డిపై 89 పెండింగ్ కేసులున్నాయని వెల్లడించారు. ఆయన వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నట్లుగా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.