హైదరాబాద్: వనస్థలిపురంలో ఇటీవల చోటు చేసుకున్న రూ.58 లక్షల దోచుకున్నది ఎవరో అన్నది పోలీసులు తేల్చేశారు. దొంగతనం కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తును అత్యంత పకడ్బందీగా విచారణ చేపట్టారు. 

విచారణలో దొంగతనానికి పాల్పడింది తమినాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాకు చెందిన రాంజీనగర్ చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. పనామా సెంటర్ దగ్గర వాహనం సెక్యూరిటీ గార్డును ఆదమరపించి ఈజీగా నగదు బాక్స్ ను తీసుకెళ్లినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

కారులో నుంచి క్యాష్ బాక్స్ ను దొంగిలించిన తర్వాత ఒక ఆటోలో వెళ్లిపోయారని తెలుస్తోంది. అనంతరం మలక్ పేట్ లోని సులభ్ కాంప్లెక్స్ లో నగదు మార్పిడి జరిగినట్లు స్పష్టం చేశారు. 

సెక్యూరిటీ సిబ్బందిని దారి మల్లించిన దొంగలు సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి అనంతరం రెండు బ్యాగులలో నగదును సర్దుకుని వెళ్లిపోయారని పోలీసుల విచారణ లో తేలింది. ఇకపోతే ఈ దొంగతనం నిందితులను పట్టుకునేందుకు తమిళనాడుతో పాటు ఐదు రాష్ట్రాల్లో 8 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఈ దొంగతనంలో కీలక నిందితులుగా నగదు బాక్స్ ను తీసుకెళ్లపదొంగతనంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే ఈ గ్యాంగ్ లో కీలక నిందితులుగా మధుసూదన్, దీపు,భీస్మర్ లుగా పోలీసులు గుర్తించారు. 

గతంలో వీరు చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.