హైదరాబాద్ బాలానగర్‌లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సు తగులబడుతూ వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలానగర్‌కి ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు అధికారులు.
హైదరాబాద్ బాలానగర్‌లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఐడీపీఎల్ రీసెర్చ్ సెంటర్ వద్ద ఆగివున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సు తగులబడుతూ వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలానగర్‌కి ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు అధికారులు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

