నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కనున్న షాపులపైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుండి బస్సులో ప్రయాణిస్తున్నవారు, షాపులవద్ద వున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అతడు నిద్రమత్తులో డ్రైవింగ్ కొనసాగించడం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద సమయంలో బస్సులో వున్న 30మంది ప్రయాణికులు సురక్షితంగా వున్నారు. అలాగే తెల్లవారుజామును షాపులు మూసివున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షాప్ ల పైకి బస్సు దూసుకెళ్లడంతో అవి స్వల్పంగా  దెబ్బ తిన్నాయి.