అధికారుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ తప్పించుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మిట్టపల్లి లక్ష్మణ్ మహబూబునాగర్ కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా చర్లపల్లి జయశంకర్ కూడలి వద్ద బస్ దూకి పారిపోయాడు. అతనిని పట్టుకుందామని ప్రయత్నించి అధికారులు విఫలమయ్యారు. వెంటనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.