హైదరాబాద్ లో దారుణం, విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి అత్యాచారం

Principal arrested for rape of student in hyderabad
Highlights

అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో రోజూ ఏదో ఒక చోట యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి ఇళ్లలోనూ, స్కూళ్లలోనూ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడే రక్షణ లేకుంటే ఇక బైట పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలుసిందే. అమ్మాయిలపై  బంధువులు, పరిచయస్తులు, ఉపాధ్యాయులు లైంగిక దాడికి పాల్పడుతున్న అనేక సంఘటనకు ఇప్పటికే బైటపడ్డాయి. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది.   

విద్యార్థులకు రక్షణగా ఉంటూ వారిని కాపాడాల్సిన ప్రధానోపాధ్యాయుడే ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కామవాంఛను తీర్చుకోడానికి కన్న బిడ్డ లాంటి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ గ్రామంలో అక్బర్ అనే వ్యక్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతడు తాను పనిచేసే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోడానికి ఇమ్రాన్ అనే వ్యక్తి సహకారాన్ని తీసుకున్నాడు. ఇలా బాలికను ట్రాప్ చేసిన ప్రధానోపాధ్యాయుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అయితే ఈ దారుణం గురించి బాధిత బాలిక భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు తప్పించుకు తిరుగుతున్న నిందితుడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

loader