Asianet News TeluguAsianet News Telugu

మాధవి లతపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ.. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాలంటూ రిక్వస్ట్

ఈసారి ఎలాగైనా హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ మాధవి లతని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

Prime Minister Narendra Modi Praises on Hyderabad MP candidate Madhavi Latha dtr
Author
First Published Apr 7, 2024, 10:59 AM IST

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అందరిలో ఉంది. తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపితో పాటు మజ్లిస్ పార్టీ కూడా తన ఉనికి చాటుకుంటోంది. అయితే మజ్లిజ్ ప్రభావం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం. 

గత చరిత్ర చూస్తే హైదరాబాద్ లోక్ సభ స్థానంలో మజ్లిస్ పార్టీకి తిరుగులేదు. ఈసారి ఎలాగైనా హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ మాధవి లతని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె విరించి హాస్పిటల్స్ చైర్మన్ గా ఉన్నారు. 

మాధవి లత బలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కూడా ఆమె క్యాంపైనింగ్ బలంగా సాగుతోంది. బిజెపి పార్టీ సిద్ధాంతాలని, హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె ఆప్ కి అదాలత్ అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో మాధవి లత చాలా బలంగా తన ఆలోచనల్ని వ్యక్తం చేశారు. ఆమె మాటలకు ప్రధాని మోడీ సైతం ఫిదా అయ్యారు. 

మోడీ స్వయంగా ట్వీట్ చేస్తూ మాధవి లతపై ప్రశంసలు కురిపించారు. మాధవి లత బలమైన విషయాలని లాజికల్ గా చెప్పారని మోడీ అభినందించారు. 'మాధవి లత గారు మీ ఆప్ కి అదాలత్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. మీకు నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ ఎపిసోడ్ ని వీక్షించండి అని మోడీ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios