తెలంగాణ వంటకాల రుచి చూడనున్న ప్రధాని.. వంటలు చేయనున్న కరీంనగర్ యాదమ్మ...

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ వంటకాలు రుచి చూపించనున్నారు.. తెలంగాణ బీజేపీ నేతలు. దీనికోసం కరీంనగర్ కు చెందిన యాదమ్మను ఎంపిక చేశారు. 

Prime Minister Modi to taste food cooked by karimnagar yadamma, BJP leaders Selected

హైదరాబాద్ : దేశ ప్రధానికి వండి వడ్డించడం అంటేనే.. కనీసం ఐదు నక్షత్రాల హోటల్లో చేయితిరిగిన నలభీములు అయి ఉండాలి.  కానీ,  హైదరాబాద్ రానున్న ప్రధాని ఓ సామాన్య చేతి వంట రుచి చూడబోతున్నారు. ఆమె అతి సాధారణమైన మహిళ అయినా, రుచికరమైన తెలంగాణ వంటల తయారీలో మాత్రం     అసామాన్యురాలు. వంటల తయారీలో అందెవేసిన చెయ్యి. అందుకే ఏరికోరి ఆమెను ఎంపిక చేశారు. 

Prime Minister Modi to taste food cooked by karimnagar yadamma, BJP leaders Selected

జులై రెండు నుంచి హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపిక చేశారు. యాదమ్మ 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తోంది. యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. యాదమ్మకు 15 యేటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యింది. దీంతో భర్తతో పాటు యాదమ్మ కరీంనగర్ చేరుకుంది. అక్కడే మంకమ్మతోటలో ఉండే వెంకన్న అనే వ్యక్తి దగ్గర  వంటలు  నేర్చుకుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: మోడీ టూర్‌కి భారీ భద్రత, 5 వేల మంది పోలీసులతో పహారా

ఈమె చేసే శాకాహార మాంసాహార వంటకాలు చాలా ఫేమస్. ఒక్కసారి రుచి చూసిన వారు ఆహా అనకుండా ఉండలేరు అని చెబుతారు. 500, 1000 మందికి కాదు ఏకంగా 10 వేల మందికి కూడా ఇట్టే.. వండి వార్చేస్తుంది యాదమ్మ. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సమావేశాలకు  చాలాసార్లు వంటలు చేయడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. యాదమ్మను బుధవారం  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  హైదరాబాద్ పిలిపించారు.  కొన్ని వంటలు తయారు చేయించుకుని  రుచి చూశారు. ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ..  ‘మోడీ సారు  తెలంగాణ వంటకాలు గురించి అడిగారట.  మా బండి సంజయ్ సారు.. మా యాదమ్మ  మంచి రుచికరమైన వంటకాలు అని చెప్పారట. 

దీని కోసం నన్ను బుధవారం పెద్ద హోటల్ కు పిలిపించారు. కూరగాయలతో భోజనం కావాలన్నారు.  పులిహోర,  పప్పు అన్నం,  దద్దోజనం,  బగారన్నం లాంటి ఐదు రకాల వంటలు… గంగవాయిల కూర పప్పు, పచ్చి పులుసు, సాంబారు, గుత్తొంకాయ కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి,  అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పు గారెలు కూడా తయారు చేస్తాం. పెద్ద హోటళ్లలో లో ముఖ్యమైన వాళ్ళ కోసం వంట చేయమంటున్నారు.  మొదటిసారి నేను చేసే వంట తింటానంటే  అంతకంటే ఎక్కువ ఏముంటుంది అదే నాకు భాగ్యం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది యాదమ్మ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios