Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్‌కి మోడీ ఫోన్: జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై ఆరా

 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు పోటీ చేశారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మోడీ ఆరా తీశారు.

prime minister modi phoned to Bandi sanjay lns
Author
Hyderabad, First Published Dec 2, 2020, 1:08 PM IST


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు పోటీ చేశారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మోడీ ఆరా తీశారు.

సుమారు 10 నిమిషాల పాటు  మోడీ బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బాగా పనిచేశారని మోడీ అభినందించారు.  బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి మోడీ సంజయ్ ను అడిగి వివరాలు తెలుసుకొన్నారు.ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సంజయ్ కు మోడీ సూచించారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు.

ఈ నెల 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను రెండోసారి ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. జీహెచ్ఎంసీపై తమ జెండాను ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.ఓటింగ్ లో పాల్గొనాాలని మీడియాతో పాటు స్వచ్చంధ సంస్థలు, ఎన్నికల సంఘం ప్రచారం చేసినా కూడ ఓటర్లు మాత్రం ఓటింగ్ లో పెద్దగా పాల్గొనలేదు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios