జనగామ: శాంతి పూజల కోసం వచ్చిన దళితులకు ఆలయంలోకి పూజారి అనుమతి ఇవ్వకపోవడంతో దళితులు ఆలయం ముందు ఆందోళనకు దిగారు.ఈ ఘటన జనగామలో చోటు చేసుకొంది.

జనగామ పట్టణంలోని గణేష్ వాడలోని ఆంజనేయస్వామి ఆలయంలో  లంకపల్లి భాస్కర్ కుటుంబం శాంతిపూజలు చేయించుకొనేందుకు ఇవాళ ఆలయానికి వచ్చింది. దళితులైన కుటుంబం కావడంతో శాంతి పూజ చేయడానికి పూజారి ఆంజనేయశర్మ నిరాకరించాడు. ఆలయం నుండి వెళ్లిపోవాలని పూజారి చెప్పాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

 

దీంతో ఆలయం ముందు దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ విషయం తెలిసిన ఇతర దళితులు కూడ అక్కడికి చేరుకొని ధర్నా చేశారు.ఈ ఆందోళన  గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. పూజారిని అదుపులోకి తీసుకొన్నారు.

దళితులంటూ పూజలు చేయకుండా అడ్డుకొన్న పూజారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.