Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ జిల్లాలో ఉప్పొంగిన బేల్కటూర్ వాగు: రైల్వేట్రాలీపై గర్భిణీ తరలింపు


వికారాబాద్ జిల్లాలోని బేల్కటూరు వాగు ఉప్పొంగడంతో ఓ గర్భిణీ తీవ్రంగా ఇబ్బందిపడింది. ఆమెను రైల్వేట్రాక్‌పై ట్రాలీలో తరలించారు.  వాగు దాటిన తర్వాత ఆమెను అంబులెన్స్ లో తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

pregnant woman travel to  hospital on Railway Trolley in Vikarabad district
Author
Vikarabad, First Published Sep 5, 2021, 11:50 AM IST


వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓ వాగు పొంగడంతో ఓ గర్భిణీ తీవ్ర ఇబ్బందులు పడింది. బేల్కటూర్ గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు ఆదివారం నాడు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ గ్రామానికి వచ్చే మార్గంలోని బేల్కటూర్ వాగుకు వరద పోటెత్తింది. దీంతో  అంబులెన్స్ గ్రామంలోకి రావానికి ఇబ్బందులు నెలకొన్నాయి.  ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు రైల్వేట్రాక్ ట్రాలీని ఉపయోగించారు.

సీసీఐ సిమెంట్ కంపెనీకి చెందిన రైల్వే ట్రాలీని రైల్వేట్రాక్ పై గర్భిణీని తీసుకొని వాగు దాటించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తాండూరు ప్రభుత్వాసుపత్రిలో  చేర్పించారు.వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో వాగులు దాటే క్రమంలో వాగులో గల్లంతైన ఘటనలు చోటు చేసుకొన్నాయి. రానున్న మూడు నాలుగు రోజులు కూడ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడ సూచించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios